ఏపీలో మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పురపాలక, నగర పంచాయతీ పీఠాలకు రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు కేటాయిస్తూ పురపాలక శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ గెజిట్‌ విడుదల చేశారు.

రాష్ట్రంలో 110 పురపాలక సంఘాలు ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. దీంతో 103 పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన గెజిట్‌ విడుదల చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి రిజర్వేషన్ల కేటాయింపును పరిశీలిస్తే.. జనరల్‌ మహిళ 26, జనరల్‌ 26, బీసీ మహిళ 17, బీసీ జనరల్‌ 17, ఎస్సీ మహిళ 7, ఎస్సీ జనరల్‌ 7, ఎస్టీ మహిళ 1, ఎస్టీ 2 స్థానాల్లో అవకాశం కల్పించారు.