సుమ మేకప్ లేకుండా (వీడియో)

సెలబ్రేటీస్ మేకప్ లేకుండా కనిపించే సాహసం చేయరు. ఆ మధ్య స్టార్ హీరోయిన్ కాజల్ మేకప్ లేకుండా దిగిన ఫోటోలని షేర్ చేసి ధైర్యం చూపించింది. ఆమె దైర్యానికి ప్రశంసలు విమర్శలు దక్కాయి. తాజాగా ప్రముఖ యాంకర్ మేకప్ లేకుండా ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో తనదైన శైలిలో మహిళల గొప్పతనాన్ని చెప్పింది.

“మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వీడియో పెట్టాలని అనుకున్నాను. ఓ ఆలోచన వచ్చింది. ఈ రోజు మేకప్‌ వేసుకోలేదు కదా.. వేసుకోకపోతే ఎలా అనుకున్నాను. అయితే, మేకప్‌ లేకపోతే సుమ ఇలా ఉంటుంది.. కళ్లేంటి కొంచెం డల్‌గా  ఉన్నాయి? అని రకరకాలుగా అంటారు. ఇది నా కష్టార్జితం. రెమ్యునరేషన్‌తో పాటు ముఖం ఇలా మారిపోతూ ఇలాంటి ప్రతిఫలాలు కూడా వస్తుంటాయి’  

“ఇలా ఎంతో మంది మహిళలు తమ ఇంటిని, వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారు. వారిపై కామెంట్లు చేస్తుంటారు. ఏంటీ నల్లబడ్డావు.. బాగా చిక్కిపోయావేంటీ? బాగా లావయ్యావేంటీ? అంటుంటారు. బయటి నుంచి వచ్చే కామెంట్లను మనం మార్చలేం. ఎలాంటి కామెంట్లు వచ్చినా మనం ఇలాగే ఉండాలి. ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా మహిళలంతా మారొద్దు.. ఆనందంగా ఉండండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వీడియోలో గలగల మాట్లాడేసింది.