నాన్నని చూడాలని ఉంది.. పోలీస్ భద్రత కోరిక అమృత !
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆదివారం హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మిర్యాలగూడ నివాసానికి తీసుకొచ్చారు. ఈరోజు సాయంత్రం మారుతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూతురు అమృత పోలీసు భద్రత కోరారు. అమృత రాకను కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై దాడి జరగొచ్చనే అనుమానంతో ఆమె భద్రతను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మారుతీరావు నివాసం వద్ద ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.