దత్తాత్రేయకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక !
హిమాచల్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తీవ్ర అస్వస్థతకి గురైనట్టు సమాచారమ్. ఈ ఉదయం 11 గంటలకి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు గ్యాస్టిక్ ట్రబుల్ అని తేల్చిన వైద్యులు. మధ్యాహ్నం తరువాత దత్తాత్రేయను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సమాచారమ్. మరోవైపు దత్తాత్రేయ అనారోగయం విషయం తెలుసుకున్న భాజాపా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దత్తాత్రేయ రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర రైల్వే మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రతి యేటా దసరాకి తన నివాసంలో అలాయ్ బలాయ్ నిర్వహించడం దత్తన్న ప్రత్యేకత.