బెల్లంకొండ సినిమా బిజినెస్ లేదు

యంగ్ హీరో బెల్లకొండ సినిమాలు భారీ బడ్జెట్ తో వస్తుంటాయ్. పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చిన సినిమాలు లేవు. ఒక్క రాక్షసుడు తప్ప. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సినిమా తెరకెక్కుతోంది. ఇధ్దరు విలన్ల మధ్యలో హీరో చేరి ఆటాడుకునే జోనర్
సినిమా. ‘కందిరీగ 2’ అన్నమాట. ఈస్ట్ గోదావరి బయ్యర్ సుబ్రహ్మణ్యం నిర్మాతగా మారి చేస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా బిజిసెన్ క్లోజ్ అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదటం. ఇంకా ఈ సినిమా పూర్తి కాలేదు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 30కోట్లు ఖర్చు చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. నాన్ థియేటర్ మీద 15 కోట్లు, థియేటర్ మీద 15 కోట్లు రావాలని చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను నల్లమలుపు బుజ్చి 13 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారు. అయితే నిర్మాత 15 కోట్ల  దాటి వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సినిమా శాటిలైట్ డిజిటల్ కలిపి జెమిని ఆరు కోట్ల వరకు అయిపోయింది. హిందీ డబ్బింగ్ బేరాలు జరుగుతున్నాయి.