‘ఫైటర్’ జోడి.. అదిరింది !


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. అనన్య పాండే కథానాయిక. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఛార్మి, పూరిలతో కలిసి ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల సెట్‌లో తీసిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విజయ్‌, అనన్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తాజాగా ఫైటర్ చిత్రబృందం ఫోటోలు మరిన్ని బయటికొచ్చాయ్.

వాటిని చూసిన జనాలు విజయ్-అనన్య జోడీ బాగుందని కితాబిస్తున్నారు. ఈ సారి చిత్రబృందంతో నిర్మాత కరణ్ జోహార్ కలిశారు. దీంతో.. ఫైటర్ కి పాన్ ఇండియా సినిమా అనే కళొచ్చింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి సినిమా అభిమానులని షాక్ కి గురిచేస్తోందని గతంలోనే విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతటి స్టన్నింగ్ కథతో ఫైటర్ తెరకెక్కుతోందని తెలుస్తోంది.