కాజల్ కితకితలు పెడుతుందట

టాలీవుడ్ చందమామ కాజల్. కోలీవుడ్ క్వీన్ ఆమె. ఇప్పుడీ చందమామ కాజల్ కితకితలు పెట్టబోతుందట. ఆమె కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ జతకట్టబోతున్నట్టు సమాచారమ్. అల్లరి నరేష్ త్వరలోనే ఓ కొరియన్ రీమేక్‌లో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. నిర్మాత సురేష్ బాబు ‘డ్యాన్సింగ్ క్వీన్ ‘ అనే కొరియన్ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఇందులో క్వీన్‌  పాత్ర కోసం కాజల్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కాజల్ ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. ఇందులో కమల్ కి జోడీగా కనిపించనుంది. మరోవైపు మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’లో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘ముంబైసాగా’కి కమిటైంది. ఇక మహేష్ ‘మహర్షి’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అల్లరి నరేష్ అదరగొట్టాడు. ప్రస్తుతం ‘నాంది’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు.