ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషి మరో ప్రయత్నం
నిర్భయ దోషులని ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. జనవరి 22న, ఫిబ్రవరి 01న, మార్చి 3న నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలుకి డేట్స్ ఖరారై వాయిదా పడ్డాయి. ఫైనల్ గా మార్చి 20కి నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదాపడింది. అయితే, మరోసారి ఉరిశిక్షని వాయిదా వేసుకొనేందుకు దోషులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు అభ్యర్థన పెట్టుకున్నాడు. మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్న సమయంలో తనలో వచ్చిన మార్పు, తన వయసు, తన కుటుంబ సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని కోరాడు. మరీ.. ఈ పిటిషన్ పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది చూడాలి.