రేవంత్ రెడ్డి అరెస్ట్’పై కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు ?
కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్ ని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు స్పందించడం లేదు. దీనిపై రేవంత్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ గాంధీ భవన్ లోని అన్ని ఛాంబర్స్ లోనూ భైటాయించారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినా కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గీయులు ఆదివారం నుంచి గాంధీ భవన్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచి బయటికి రావడం లేదు. మరోవైపు, పార్టీని సంప్రదించకుండా ఆందోళనలు చేయడంపై కాంగ్రెస్ ముఖ్యనేతలు తప్పుబడుతున్నారు.
రేవంత్ రెడ్డికి సంబంధించిన పంచాయతీ ఢిల్లీలో జరుగుతోంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చర్చించనున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఒట్టెత్తుపోకడలు కాంగ్రెస్ సీనియర్లకి రుచించడం లేదని చాన్నాళ్లుగా ప్రచారం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్ పై వారెవరు స్పందించడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.