తమన్నాకి స్వయంవరం.. ఆ ముగ్గురికి హీరోలకి ఆహ్వానం !

అందమే కుళ్లుకొనే అందం మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే హీరోయిన్ గా 15యేళ్లు పూర్తి చేసుకుంది తమ్మూ. ఈ సందర్భంగా ఆమెకి సన్నిహితులు, స్నేహితులు, ప్రేక్షకుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. తనకి కాబోయే భర్త లక్షణాలు ముగ్గురు హీరోలకి మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ఒకవేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తే.. ఎవరు రావాలనుకుంటున్నారు? అసలు మీకు ఎలాంటి భర్త కావాలి? అన్న ప్రశ్నలకు తమన్నా సమాధానం ఇస్తూ.. ఒకవేళ మా అమ్మ గనుక నాకు స్వయం వరం ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్‌లను కూడా పిలుస్తానని చెప్పింది. వీరి ముగ్గురికే నాకు భర్త అయ్యే అర్హత ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్‌తో డేటింగ్‌కి వెళ్లాలని ఉంది కూడా చెప్పింది.

వాస్తవానికి తమన్నాకి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు ఎవరితో లింకు పెడుతూ తమన్నాపై వార్తలు రాలేదు. డేటింగులు, ఎఫైర్లకి తమన్నా చాలా దూరం. అలాంటి తమన్నా మనసులో ముగ్గురు హీరోలు ఉన్నారు. వారు ముగ్గురు కత్తిలాంటోళ్లు. హృతిక్ రోషన్, ప్రభాస్ లకి లేడీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇక విక్కీ కౌశల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి.. మిల్కీ టేస్ట్ అదిరిందని చెప్పవచ్చు.