వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

వైకాపా రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు స్థానాలని కూడా వైకాపనే గెలుచుకోనుంది. ఈ నేపథ్యంలో నలుగురు అభ్యర్థులని వైకాపా ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైకాపా సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డితో పాటు పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానికి సీట్లను కేటాయించింది.

ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో.. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీర్మాణం చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్మాణాన్ని కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదించిన యెడల శాసనమండలి రద్దు కానుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవిలకి రాజ్యసభ అవకాశం కల్పించారు.