రహానె 5 వ్యాపార సూత్రాలు

టీమిండియా ఆటగాడు అజింక్య రహానెకు వ్యాపారాలతో సంబంధం లేదు. కానీ ఆయన నుంచి ఐదు వ్యాపార సూత్రాలని నేర్చుకోవట. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా తెలిపారు. పుణె జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడే హర్ష గోయెంకా.  వీరికే సియట్‌ టైర్ల సంస్థ ఉంది. దానికి రహానె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వ్యాపార నిర్వహణలో భాగంగానే రహానెను కలిసిన హర్ష గోయెంకా అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు.

రహానె నుంచి ఐదు వ్యాపార పాఠాలు నేర్చుకోవచ్చు. 1) ఫలితాలపై దృష్టిపెట్టొద్దు. ఆటను ఆస్వాదించాలి. 2) గెలవాలంటే బృందస్ఫూర్తి, ఐకమత్యం కావాలి. 3) విజయానికి ఫిట్‌నెస్‌, పౌష్టికాహారం అవసరం. 4) నియంత్రించగలిగే వాటిపైనే దృష్టి కేంద్రీకరించాలి. 5) వ్యక్తిగతంగా బాగా సన్నద్దం అవ్వాలి. ప్రతి రోజూ 100 క్యాచ్‌లు సాధన చేస్తాను.