కోర్టుమెట్లు ఎక్కుతున్న హీరోయిన్

మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ ఖాళీ దొరికినప్పుడల్లా కోర్టు మెట్లు ఎక్కుతుందట. అలాగని ఆమె ఏ సెక్స్ రాకెట్ లో పట్టుబడలేదు. ఆమెది క్లీన్ ఇమేజ్ నే. మరెందుకు కోట్లు మెట్లు ఎక్కుతుంది ? అంటే.. వృత్తిరీత్యా ఆమె లాయర్. రవితేజ సరసన నేల టిక్కెట్ చిత్రంలో నటించింది మాళవికా శర్మ. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ చిత్రంలో నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కాకుంటే.. క్రిమినల్ లాయర్ అయ్యేదట. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పై చదువులు చదువుతోంది. ఈ క్రమంలో లాయర్ పట్టా అందుకుంది. అంతేకాదు.. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే లాయర్ గా ప్రాక్టీస్ మొదలెట్టింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ క్రిమినల్ లాయర్ పట్టాభి వద్ద ఇంటర్న్ షిప్ చేస్తోంది. ‘రెడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఖాళీ సమయంలో కోర్టు మెట్లు ఎక్కుతోంది. మరీ.. ఈ క్రిమినల్ లాయర్ హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ‘రెడ్’ తెరకెక్కుతోంది. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ కథానాయికలు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి తర్వాత రామ్‌-కిశోర్‌ తిరుమల కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.