కరోనాపై విజయ్ ప్రచారం
ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. మన దేశంలోనూ విజృంభిస్తోంది. వేసవికాలం అయినా.. సడెన్ వాతావరణం చల్లబడటంతో కరోనా వైరస్ వ్యాపించేందుకు మరింత అనూకూల పరిస్థితులు ఏర్పడినట్టు అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది.
తాజాగా టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రచారం చేశారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. “కరోనా వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్నజాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్దతిగా నమస్కారం పెట్టండి. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. రెగ్యూలర్ గా చేతులని సబ్బుపెట్టి కడుక్కోండి. మీ కళ్లని, ముక్కు, నోరు, చెవిని చేతులతో తాకకండి. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతుంటే.. వాళ్ల నుంచి మినిమమ్ 3 అడుగుల దూరంలో ఉండండి. రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దు. మనందరం కరోనా వైరస్ ని అరికట్టాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే”నని తెలిపారు విజయ్.
Issued in Public Interest#VijayDeverakonda lists out Dos and Don'ts in the outbreak of #Coronavirus
Need not panic about #Corona pic.twitter.com/7SEC3FT83N
— BARaju (@baraju_SuperHit) March 10, 2020