రేవంత్ రెడ్డిని బహిష్కరించిన కాంగ్రెస్ ?

కాలం కలిసొస్తే.. తెలంగాణ పీసీసీ పదవి దక్కాల్సిన నేత రేవంత్ రెడ్డి. కానీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు బహిష్కరించినట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడుపై గోపన్ పల్లి భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే.. అనుమతి లేకుండా మంత్రి కేటీఆర్ పామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాని ఎగరవేసేరనే కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చర్లపలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అరెస్టయిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కడం లేదు. పైగా ఎంపీ రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ సీనియర్లు మీడియా ముందుకొచ్చి.. రేవంత్ రెడ్డి ఒట్టెద్దుపోకడలని విమర్శిస్తున్నారు. వ్యక్తిగత వివాదాలని పార్టీకి రుద్దొద్దని హితువు పలుకుతున్నారు. రేవంత్ సొంత అజెండాతో ముందుకెళ్లి.. వివాదాల్లో ఇరుక్కుట్టే పార్టీకి ఏం సంబంధం ? వ్యక్తిగత వివాదాలని పార్టీకి రుద్దుతారా ? అని ప్రశ్నిస్తున్నారు. 111జీవో పై రేవంత్ రెడ్డి అంత యాగీ చేయాల్సిన పనేముందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లు దామోదర్ రాజనరసింహా, జగ్గారెడ్డి, విహెచ్ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి అరెస్ట్, ఆయన వ్యక్తిగత వివాదాలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని ఉత్తమ్, కుంతియా దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. కష్టకాలంలో రేవంత్ రెడ్డికి అండగా నిలువాల్సిన సీనియర్లు.. పనిగట్టుకొని రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించే దిశగా ప్రణాఌకలు రచిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ? రేవంత్ రెడ్డిని తప్పిస్తే.. పీసీసీ పదవి కోసం ఓ అడుగు ముందుకేసినట్టేనని సీనియర్ల భావన కావొచ్చేమో.. !