మంచిర్యాలలో కరోనా కేసు
తెలంగాణలోనూ కరోనా వైరస్ విజృభిస్తోంది. వరుసగా కరోనా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంచిర్యాలలో కరోనా వైరస్ కేసు బయటపడింది. 12 రోజుల క్రితం ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన యువకుడిని పరీక్షించిన వైద్యలు కరోనా లక్షణాలు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మంచిర్యాల యువకుడు ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఇక్కడికి వచ్చారు. మరోవైపు కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తయింది. రాష్ట్రంలో కరోనాని అరికట్టేందుకు రూ. 100కోట్లు కాదు.. రూ. 500కోట్లు ఖర్చుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభలో ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఈ సాయంత్రం కరోనాపై ఉన్నతస్థాయి కమిటీ భేటీ కానుంది.