పెట్రో లాభాల కోసం కేంద్రం కీలక నిర్ణయం

దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదంటే ఇదేనేమో.. ! అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు భారీగా తగ్గుతాయని వాహనదారులు ఆశపడ్డారు. కానీ ఆ లాభాలని కేంద్రం కొట్టేసేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్ , డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  లీటరు పెట్రోల్‌పై ప్రత్యేక సుంకాన్ని రూ.2 నుంచి రూ.8 వరకు, డీజిల్‌పై నాలుగు రూపాయలను పెంచారు.
 
పెట్రోల్‌పై రోడ్డు సుంకాన్ని కూడా లీటరుకు రూపాయి, డీజిల్‌పై పది రూపాయలకు పెంచారు. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల సాధారణంగా ఇంధన ధరలు పెరుగుతాయి. అయితే అంతర్జాతీయ ధరలు తగ్గడం వల్ల.. వినియోగదారులపై ఆ ప్రభావం పడే అవకాశాలు లేవు. ఇదే తరహా పెట్రో ధరలు పెరిగిన సమయంలోనూ కేంద్రం ఎక్సైజ్ సుంకాలని భారీగా తగ్గిస్తే బాగుంటుందేమో.. !