ఘనంగా హీరోయిన్ షీలా వివాహ వేడుక
హీరోయిన్ షీలా దక్షిణాది బాషలన్నింటిలో నటించింది. ముందుగా తమిళ సినిమాలు.. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ తెరపై మెరిసింది. తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టింది. అల్లు అర్జున్ ‘పరుగు’, ఎన్ టీఆర్ ‘అదుర్స్’, రామ్ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాల్లో షీలా నటించింది. మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది. కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న షీలా.. శుక్రవారం ఓ ఇల్లాలయింది.
ఈవీపీ సంతోష్ రెడ్డితో షీలా వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. ఇరు కుంటుంబాల బంధువులు మిత్రులు, ఆప్తులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లుగా సమాచారమ్. అయితే సినీ ప్రముఖుల కోసం త్వరలో వివాహ విందుని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.