త్రిష స్థానంలో ఇలియానా ?

మెగస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నుంచి హీరోయిన్ త్రిష తప్పుకుంది. ‘క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్‌ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా’నని ట్విట్ చేసింది త్రిష. త్రిష విషయంలో చిత్రబృందం వర్షం ఏంటీ ? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు త్రిష స్థానంలో ఎవరిని తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఆచార్య సినిమాలో హీరోయిన్ గా పోటీపడిన వారి లిస్టుని ఒకసారి పరిశీలిస్తే.. అనుష్క, నయనతార, ఇలియానా, ఈషారెబ్బా, రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తదితరులు ఉన్నారు. అయితే వీరిలో త్రిష స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఇలియానాకి ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పెద్దగా డిమాండ్స్ ఏమీ లేవు. చిరు సినిమాలో అవకాశం ఇస్తే చాలు. పారితోషికం పట్టించుకోనని ముందే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మధ్య ఇల్లీ బాగా సన్నబడింది. మునుపటిలా సన్నజాజిలా మారింది.

త్రిషని ఫైనల్ చేయడం కంటే ముందు దర్శకుడు కొరటాల మైండ్ లో త్రిషనే ఉందట. ఈ నేపథ్యంలో త్రిష స్థానంలో ఇలియానని తీసుకోవడం ఖాయమని చెప్పుకొంటున్నారు. ఇలియానా వర్షన్ ఏంటీ అంటే.. ? చిరు సినిమాతో హిట్ కొడితే మరోసారి టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ ఓ రౌండ్ వేయొచ్చు. మరీ.. చూడాలి ఇల్లీ పంట పండుతుందేమో !