ఇవాంకలో కరోనా కలవరం
వివిధ దేశాల్లోని ప్రముఖ నేతలు సైతం కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రెగొరీకి వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలతో సహా దంపతులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇరాన్‌లో పలువురు నేతలు, ఉన్నతాధికారులు వైరస్ బారిన పడ్డారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా సోకిన వ్యక్తులని కలిసినట్టు వార్తలొచ్చాయ్. దీంతో ఆయన కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కుమార్తె ఇవాంకలో కూడా కరోనా కలవరం మొదలైంది.
ఇవాంక ట్రంప్‌తో భేటీ అయిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ డుటన్‌కూ కరోనా సోకింది. దీంతో ఇవాంక ఇంటికే పరిమితమయ్యారు. అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. అయితే ఆమెకి కరోనా ఏమీ సోకలేదు. కానీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె ఇంటికి పరితమైందని తెలుస్తోంది. కరోనా వైరస్ కి ఉన్నోడు, లేనోడు అనే తేడానే లేదు. అందరిలోనూ భయాన్ని కలిగిస్తోంది.