కరోనా కట్టడికి మెగాస్టార్ సూచనలు

కరోనా నియంత్రణ బాధ్యతని ప్రభుత్వాలకే వదిలేయకుండా అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వ్యాప్తికాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలని చిరు అభినందించారు. అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకొన్నారని ప్రసంశించారు. 

సినిమా షూటింగ్స్ లో కూడా చాలామంది సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 15రోజుల పాటు సినిమా షూటింగ్స్ వాయిదా వేస్తే బాగుంటుందని భావిస్తున్నాని చిరు అన్నారు. తన తాజా సినిమా ఆచార్య సినిమాని వాయిదా వేసినట్టు చిరు తెలిపారు. సినిమా షూటింగ్ వాయిదా వేద్దామని అడగగానే దర్శకుడు కొరటాల అంగీకరించారని చిరు అన్నారు. షూటింగ్స్ వాయిదా పడటం వలన ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లినా.. కరోనా కట్టడి ఉద్యమంలో సినీ రంగం పాలుపంచుకోవాలని చిరు పిలుపునిచ్చారు.