రేవంత్ రెడ్డివి చీప్ పాలిటిక్స్ 

మల్కాగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేశాడని విమర్శించారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి. డ్రోన్ కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ సీనియర్లు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడం లేదు. గోపన్ పల్లి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసింది తప్పని కాంగ్రెస్ సినీయర్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి సొంత అజెండాని పార్టీకి రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు దామోదర రాజనరసింహా, జగ్గారెడ్డి, వీహెచ్ హనుమంతరావు తదితరులు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరారు. 111 జీవో పై రేవంత్ రెడ్డి మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
 
గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో తప్పు జరగకుంటే ఆధారాలు బయటపెడితే అయిపోయేది. ఆ పని చేయకుండా కేటీఆర్‌ పామ్‌హౌస్‌ దగ్గర హడావిడి చేయడం రేవంత్‌రెడ్డి తప్పేనన్నారు. చీప్‌ పాలిటిక్స్‌ మంచిది కాదు. ఇక పీసీసీ పదవిపై మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి..  పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి అన్ని అర్హతలు నాకున్నాయి. నా తరువాతే ఇంకా ఎవరైనా అన్నారు.