కరోనాపై ఖర్చుకు రూ.500 కోట్లు
తెలంగాణలో కరోనా కట్టడికి అవసరమైతే రూ. 100కోట్లు కాదు.. రూ. 500కోట్లైనా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే కరోనా కట్టడికోసం తీసుకోవాల్సిన చర్యల కోసం రూ. 500కోట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చైనా చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రాథమికంగా రూ.500 కోట్లు వెచ్చించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా వినియోగించేందుకు వీలుగా సీఎస్‌కు ఆ అధికారాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1020 ఐసోలేషన్ బెడ్స్ అందుబాటులో ఉంచాం. మరో 321 ఐసీయూ బెడ్స్ ఉంచాం. ఇంకో 240 వెంటిలేటర్లు సిద్ధం ఉంచాం. రాష్ట్రంలో క్వారంటైన్ ఉంచడానికి నాలుగు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.