తెలంగాణ ట్యాగ్ లైన్’కు న్యాయం చేస్తున్నాం
నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్ లైన్. అందుకోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం. సాధించుకున్నం. ఇప్పుడీ టాగ్య్ లైన్ కి న్యాయం చేస్తున్నాం అన్నారు మంత్రి హరీష్ రావు. శనివారం శాసనసభలో చెక్ డ్యాంలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 146 చెక్ డ్యాంలు మంజూరు చేశాం. 53 చెక్ డ్యాంలు పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చెక్ డ్యాంల కింద 56.776 ఎకరాల ఆయకట్టు సాగుకు ఇవి ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం 3825 కోట్ల అంచనా వ్యయంతో భారీ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల ప్రవాహాలపై 4వ ఆర్డర్ నుంచి 8వ ఆర్డర్ వరకు 1200 చెక్ డ్యాంలు నిర్మాణం కోసం పరిపాలన పరమైన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. నీళ్లు. నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తెలంగాణ. ఏ నీళ్ల కోసం పోరాడామో… సీఎం కేసీఆర్ ఆ నీళ్లు ప్రజలకు ఇచ్చేందుకు కష్టపడుతున్నారు అన్నారు.