కరోనా కట్టడికి తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు !
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. సుదీర్ఘంగా చర్చించిన సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బహిరంగ సభలు, వర్క్‌షాపులు, ర్యాలీలు వంటివి అనుమతించబోం. జిమ్ములు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియం, అమ్యూజ్‌మెంట్ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు రద్దు చేస్తున్నాం. సినిమా హాళ్లు, పబ్బలు, క్లబ్బులు మూసివేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సులు, మెట్రో యథావిధిగా నడుస్తాయి. ప్రజలకు నిత్యావసరాల దృష్ట్యా సూపర్ మార్కెట్లు, మాల్స్ యథావిధిగా పనిచేస్తాయి. ప్రజలు కూడా వీలైనంత జనసమ్మర్థ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పెళ్లి మండపాలు కూడా మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమై ఉంటాయ్ కాబట్టి వాటిపై నిషేధం నిలిపివేశాం. అయితే, 200 మంది మించకుండా వివాహం చేసుకోవాలి. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. మార్చి 31 తర్వాత మ్యారేజ్ హాల్స్‌కు కూడా అవకాశం ఇవ్వబోమని తెలిపారు.