కరోనా ఎఫెక్ట్ : హైదరాబాద్’లో థియేటర్స్ మూసివేత !
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళ, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో థియేటర్లు మూసి వేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనూ థియేటర్స్ మూతపడనున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకున్నా.. ఎగ్జిబిటర్ల చాంబర్ నే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు సమాచారమ్.
వాస్తవానికి ప్రస్తుతం థియేటర్స్ నడిపినా ఏం లాభం లేదు. సినిమా రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. ఈ నెల 25న రావాల్సిన ‘వి’ వాయిదా పడిందని చెబుతున్నారు. కరోనా భయంతో జనాలు థియేటర్స్ కి రావడం లేదు. దీంతో రిలీజైన సినిమాలకి కలెక్షన్స్ లేవు. కనీసం మెయింటెనెన్స్ ఖర్చులకి సరిపోయే వసూళ్లు రావడం లేదట. ఈ నేపథ్యంలో థియేటర్స్ ని రన్ చేయడం కంటే మూసివేయడమే బెటరని ఎగ్జిబిటర్ల చాంబర్ ఈ నిర్ణయాన్నికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, థియేటర్స్ ని మూసేయాలని యోచనలో రాష్ట్రప్రభుత్వాలు ఉన్నాయి.