‘వి’ విడుదల వాయిదా ?

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే పడుతోంది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్, సినీ ఫంక్షన్స్, సినిమా రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. కరోనాని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలే థియేటర్స్ మూసివేతకు ఆదేశిస్తుండటం పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇదీగాక ప్రజలు థియేటర్స్ కి వెళ్లడానికి జక్కుతున్నారు. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో కరోనా భయంతో థియేటర్లు మూసి వేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 

ఇలాంటి ఆదేశాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 25న రానున్న నాని ‘వి’ చిత్రం వాయిదా వేయాలని చాలా మంది కోరుతున్నారు. కానీ దిల్ రాజు ఇంకా ఆ దిశగా చర్యలేవీ తీసుకోలేదు. ఇంకోవారం సమయం ఉంది.. గనుక ఆలోగా పరిస్థితిని అంచనా వేసి.. ఓ నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.