‘వకీల్‌సాబ్‌’ కొత్త పిక్.. అదిరింది !  

‘వకీల్‌సాబ్‌’గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ ‘పింక్’ రిమేక్ ఇది. ఇందులో అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. మే 15న వకీల్‌సాబ్‌ రిలీజ్ డేటు అనుకొన్నా.. కరోనా ఎఫెక్ట్ తో వాయిదాపడే అవకాశాలున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పిక్ బయటికొచ్చింది. సెట్స్ లో తీసిన పిక్ ఇది. ఇందులో సైడ్ లుక్ లో తీక్షణంగా చూస్తున్నారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వకీల్‌సాబ్‌ బెస్ట్ లుక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వకీల్‌సాబ్‌ తో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుంది. మొత్తానికి.. ఈ యేడాది పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.