‘శివ’ సినిమాలో పూరిని చూశారా ?

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘శివ’. శివకి ముందు శివ తర్వాత టాలీవుడ్ అన్న రేంజ్ లో హిట్టయింది. నాగార్జున కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. అది శివకి మించిన సినిమా అనిపించుకోదు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆయన శిష్యుడు, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకుడుగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ కూడా నటించారు.

దానికి సంబంధించిన పిక్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘శివ షూటింగులో నాగార్జున, ఇస్మార్ట్ పూరి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు వర్మ. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పూరి బక్కపలుచగా రౌడీ లుక్ లో కనిపిస్తున్నారు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన పూరి.. ఆ తర్వాత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి పలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించారు.