సీఎంగా పవన్.. ముహూర్తం ఫిక్స్ !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దానికి ముహూర్తం కూడా ఫిక్సయిందని సమాచారమ్. అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అవునూ.. ‘వకీల్ సాబ్’గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు పవన్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇందులో పవన్లా యర్ రోల్ పోషిస్తున్నారు పవన్. బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు పవన్.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కి పూరి  స్టోరీ లైన్ వినిపించారని, దానికి పవర్ స్టార్ సుముఖత వ్యక్తం చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో పవన్‌ని సీఎంగా చూపించబోతున్నారట పూరి. కథ ప్రకారంగా పవన్ సీఎం రోల్ పోషించబోతున్నారట. ఇదే నిజమైతే.. పవన్ రియల్ లైఫ్ లక్ష్యాన్ని రీల్ లైఫ్ లో తీర్చుకోబోతున్నారన్నమాట.