ఘనంగా మ్యాక్స్‌వెల్‌ నిశ్చితార్థం

ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ నిశ్చార్థ వేడుక భారతీయ సంప్రదాయంతో ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌ ని మాక్స్ వెల్ పెళ్లాడబోతున్నాడు. వీరి నిశ్చితార్థ వేడుక మెల్ బోర్న్ లో భారతీయ సాంప్రదాయ శైలిలో ఘనంగా జరిగింది. మ్యాక్స్‌వెల్‌ తరఫు బంధువులు కూడా చీరకట్టు, కుర్తా, పైజామాలు ధరించి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం విశేషం. మ్యాక్స్‌వెల్‌ భారతయ యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా నిలవనున్నాడు. అంతకుముందు ఆసీస్‌ పేసర్‌ షాన్‌ టైట్‌ భారత్‌కు చెందిన యువతినే పెళ్లాడాడు.