దేవాకట్టాకు మహేష్ ఛాన్స్

దర్శకుడు దేవాకట్టాకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆయనకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ  సంస్థలో మహేష్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు వెబ్ సిరీస్ లని నిర్మిస్తున్నారు. ఈ సంస్థలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు దేవాకట్టాకి అవకాశం ఇచ్చారు మహేష్. అమెజాన్‌ కోసం ఈ వెబ్‌సిరీస్‌ను తీయనున్నారట.

ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయ్. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఓ వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారమ్. ఇందులో యాక్షన్ హైలైట్ గా ఉండనుంది చెబుతున్నారు.