కవితకు మంత్రి పదవి

సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత గతంలో కేంద్రం మంత్రి కావాలని ఆశపడింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరిన కవితకి మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇక ఇటీవల కవితని రాజ్యసభకి పంపించనున్నారనే ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ కూతురు మీద ప్రేమ చూపుతూ రాజ్యసభకి పంపించలేదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. ఆమెకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కవిత పేరు ఖరారైంది.

ఈ స్థానికి ఎమ్మెల్సీగా ఉండే ఆర్. భూపతి రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని కవితకి ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కవిత నామినేషన్ వేయనున్నారు. దీంతో ఆమె గెలుపు లాంఛనమే. అంతేకాదు.. కవితని మంత్రివర్గంలోకి తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది. కవితక్కకి ఏ శాఖని కేటాయిస్తారు ? అదెప్పుడు ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.