వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరో భూ దందా
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ దందాలు ఒకొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. ఉప్పల్ లోనూ రేవంత్ రెడ్డికి విలువైన భూములున్నాయట. అయితే వాటిని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనకపోవడం ఇప్పుడు వివాదస్పదం అవుతోంది. 2006లోనే రేవంత్ రెడ్డి ఉప్పల్ లో 74గుంటల భూమిని కొన్నారట. రూ. 12కోట్లకి ఈ భూమిని కొన్నారని.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 36లక్షలు కట్టాల్సి ఉంటే.. కేవలం 15లక్షలు మాత్రమే కట్టారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. ఉప్పల్ భూమిని ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూపించకపోవడం వివాదాస్పదంగా మారింది. 2006 తర్వాత రేవంత్ రెడ్డి నాలుగు సార్లు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఏ ఎన్నికల్లోనూ ఉప్పల్ గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి మామ, సోదరుడు పేరు మీద హైదరాబాద్ లోని పలు చోట్ల భూములు కొన్నారని.. వాటికి సంబంధించి ప్రభుత్వానికి కోట్లు ఎగొట్టారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్ కేసులు అరెస్టయిన రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.
గోపన్ పల్లి