‘వకీల్ సాబ్’ వాయిదా పక్కా !

కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్, సినీ పంక్షన్స్ వాయిదాపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 31 వరకు థియేటర్స్ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సిన ‘వకీల్ సాబ్’ కొత్త షెడ్యూల్ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. మే 15న వకీల్ సాబ్ రిలీజ్ కూడా వాయిదా పడనుంది చెబుతున్నారు.

దాదాపు 10రోజుల షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో.. మే వరకు సినిమాని రెడీ చేయడం దాదాపు అసాధ్యం. అందుకే వకీల్ సాబ్ వాయిదా పక్కా అంటున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, నివేతా థామస్, అనన్యలు కీలక పాత్రలు పోషించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.