కరోనా నిర్మూలన కోసం 11రోజుల యాగం ప్రారంభం

కరోనా నిర్మూలన కోసం విశాఖ శారదాపీఠంలో యోగవాసిష్ట యాగం చేస్తున్నారు. 11రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. విషజ్వరాలు తగ్గడం కోసం వేదాల్లో చెప్పిన మంత్రాలతో యాగం చేస్తున్నామని పండితులు చెబుతున్నారు. ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉండాలి. తలుపులకి పసుపురాయాలి. ఇంటిముందు వాకిట్లో పేడతో కలిపిన నీళ్లని చల్లాలని చెప్పారు.

మరోవైపు కరోనా నేపథ్యంలో టీటీడీ, ఇతర దేవాలయాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు స్వామివారి దర్శనానికి రావొద్దని టీటీడీపీ తెలిపింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వీరిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో నమోదైన తొలి కరోనా పాజిటివ్ కేసు.. నెగటివ్ గా మారింది.