ప్రభాస్ కోసం కన్నీరు పెట్టుకున్న అనుష్క


ప్రభాస్-స్వీటీ అనుష్క ప్రేమజంట అనే ప్రచారం ఉంది. కాదు.. మేం మంచి స్నేహితులమని ప్రభాస్, అనుష్క చెప్పినా నమ్మడం లేదు. అయితే అనుష్కకి ప్రభాస్ అంటే ప్రాణ స్నేహితుడు అంతకుమించి అని అర్థమవుతోంది. తాజాగా స్వీటీ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఇందులో ప్రభాస్ గురించి అనుష్కని సుమ అడిగిన ప్రశ్నలు-సమాధానాలు హైలైట్ గా నిలిచాయి. మొదట ప్రభాస్ ఫోటోను సుమ చూపించి, ఇతడి గురించి పాజిటివ్ పాయింట్ చెప్పండి అని అడిగింది. ఈ సమయంలోనే అనుష్క ‘నా కొడుకు గురించా ‘అని అడిగింది. ఈ ప్రోమోలో అనుష్క కన్నీరు పెట్టుకోవడం ఆమె అభిమానులని బాధిస్తోంది. అదికూడా ప్రభాస్ కోసం కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దానికి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వారం క్యాష్ ప్రోగ్రామ్ చూడాల్సిందే.