విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తాం : సీఎం కేసీఆర్

ఇటీవల విదేశాల నుంచి తెలంగాణకి వచ్చిన వారిని గుర్తిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ఉద్దంతం నేపథ్యంలో మార్చి 1 తర్వాత విదేశాల నుంచి తెలంగాణకి వచ్చిన వారిని గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారే స్వయంగా వచ్చి కలెక్టర్ ని కలిస్తే బాగుంటుందని సీఎం అన్నారు. గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఉగాధి, శ్రీరామ నవవి ఉత్సవాలని రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాంగ శ్రవణం టీవీల్లోలైవ్ టెలికాస్ట్ చేయిస్తామని తెలిపారు. దేవాలయాలు, చర్చలు, మసీదులకి ప్రజలని అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. ప్రజలు గుమికూడకపోవడం వలన కరనాని కట్టడి చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని సీఎం కేసీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులని బట్టీ మరిన్ని  నిర్ణయాలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.