కరోనాపై కేంద్ర కీలక నిర్ణయాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా సోకి నలుగురు మృతి చెందారు. 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 10యేళ్ల లోపు పిల్లలు, 60యేళ్లకి పైబడిన వారు  ఇంటి నుంచి బయటికి రాకుండా జాగ్రతపడ్డాలని సూచించారు.

దేశ సరిహద్దులని మూసివేస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సర్వీసులు మినహా, ప్రయివేటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలని కేంద్రం సూచించింది. రోమ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ఈ నెల 21న ప్రత్యేక విమానాన్ని పంపిస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర కఠిన సూచనలు చేసింది.