లాక్ డౌన్ ప్రకటిస్తారా ?

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు జాతీయని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ప్రధాని ఏం మాట్లాడతారు ? అన్నది ఆసక్తిగా మారింది. అయితే, ప్రధాని లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందనీ, కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి అది ఒక్కటే మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ ప్రకటించకుంటే తాను తీవ్రంగా నిరాశ చెందుతానన్నారు. దేశాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. కనీసం నగరాలు, పట్టణాలలో రెండు నుంచి నాలుగు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించకపోతే అంతకంటే దారుణం మరొకటుండదని రాసుకొచ్చారు.