కరీంనగర్’లో ఆపరేషన్ ఇండోనేషియా

కరోనాతో తెలంగాణ వణికిపోతుంది. కరీనంగర్ లో 8మందికి కరోనా పాజిటివ్ తేలడం కంగారుపెడుతోంది. వీరంతా ఈ నెల 13న ఇండోనేషన్ నుంచి భారత్ కి వచ్చారు. ఢిల్లీ నుంచి సంపర్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించి కరీంనగర్ చేరుకున్నారు. వీరు ప్రయాణించిన ఎస్-9 బోగిలో 82మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీరిని గుర్తించడం తలనొప్పిగా మారింది.

కరీంనగర్ లో దిగిన ఇండోనేషియా బృందం వాహనంలో పలు ప్రార్థనా స్థలాలని సందర్శించారు. పలువురితో మాట్లాడారు. వారిని గుర్తించడం ఎలా ? వారికి చికిత్స ఎలా ?? అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఛాలెంజ్ గా మారింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఆపరేషన్ ఇండోనేషన్ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.

సీసీ పుటేజ్ ల ఆధారంగా ఇండోనేషన్ బృందం ప్రయాణించిన బోగిలోని ప్రయాణికులని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా సంపర్ క్రాంత్ ఎక్స్ ప్రెస్ లో ఎస్ 9 బోగీలో పయనించిన వారు స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు, కరీంనగర్ లో ఇంటింటికి కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా.. కరీంనగర్ లో 144సెక్షన్ కొనసాగుతోంది. మరికొద్దేపట్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. కరీంనగర్ లో ఆపరేషన్ ఇండోనేషియాకి ప్లాన్ చేయబోతున్నారు.