అంగన్వాడీలని ఎందుకు మూసేయడం లేదు ?
కరోనా ప్రభావంతో విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అంగన్ వాడీ కేంద్రాలు మాత్రం నడుస్తున్నాయి. దీనిపై రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ని ప్రశ్నిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని తెలిపారు.
కరోనా లక్షణాలున్న వారు కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. అటువంటి వారిని గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాస్తవానికి చిన్నపిల్లలకి, పెద్దలకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు అంగన్ వాడీలకి సెలవులు ప్రకటించకపోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి మాత్రం అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9గంటల నుంచి 11గంటల లోపు వండి వేడివేడిగా తల్లులు, పిల్లలకు అందించాలని సూచిస్తున్నారు.