భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్నట్టు కనబడుతోంది. రోజురోజూకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 222 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఏపీలో 3 కేసులు నమోదయ్యాయ్.

సెలబ్రేటీలు, ప్రజా ప్రతినిధులే కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ ఇటీవల లండన్ వెళ్లొచ్చారు. ఆ విషయాన్ని దాచిన ఆమె లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైంది. ఆ కార్యక్రమానికి ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. ఆయన ఇవాళ పార్లమెంట్ సమావేశాలని హాజరయ్యారు. పలువురు ఎంపీలతో కరచాలనం చేశారు. సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు కనిక కపూర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో కేంద్ర మంత్రుకు, ఎంపీలు అప్రమత్తమయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్తున్నారు. 

తెలంగాణలోనూ  ఇటువంటి నిర్లక్ష్యపు ఘటనే వెలుగులోకి వచ్చింది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప ఇటీవల అమెరికా వెళ్లొచ్చారు. అయితే ఆయన బయట తిరిగారు. మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ విదేశాల నుంచి వచ్చిన వారు వైద్యులని సంప్రదించాలని, 14రోజుల క్వారంటైన్ కి వెళ్లాలని సూచించిన ఎమ్మెల్యే కోనప్ప పట్టించుకోలేదు. తాజాగా కోనప్ప కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.