కరోనా ఎఫెక్ట్.. వాట్సాప్ కీలక నిర్ణయం !
సోషల్ మీడియాలో దుష్ప్రచారమే ఎక్కువ అనే భావన ఉండేది. కానీ కరోనా ప్రభావం నేపథ్యంలో.. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ ఇన్ఫర్మేషన్ హబ్ ను ప్రారంభించింది. కరోనా వైరస్ కు సంబంధించిన సమాచరాన్ని ఈ ఇన్ఫర్మేషన్ హబ్ ద్వారా యూజర్లు తెలుసుకోవచ్చు.
ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకి పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 223కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.