బ్రేకింగ్ : కేంద్ర మంత్రులు, ఎంపీల అందరికీ కరోనా వైరస్ !

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నారు. దీనంతటికి కారణం బాలీవుడ్ సింగర్ కనిక కపూర్. ఆమెకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల కనిక లండన్ వెళ్లొచ్చారు. ఆ విషయం దాచిపెట్టేసి… లక్నోలో ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి కనిక హాజరైంది.
 
ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనయుడు ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ ని కలిశారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి తిరిగారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ఎంపీలకి కరోనా భయం పట్టుకుంది. వీరింతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలని రద్దు చేయాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే వసుంధర రాజే, దుష్యంత్ సింగ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సింగర్ కనిక కపూర్ చేసిన నిర్లక్ష్యం పనికి.. రాజకీయ ప్రముఖులు బలైపోతున్నారు. అందుకే కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాలి. శుభ్రత పాటించాలి. విదేశాల నుంచి వచ్చినవారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. నెగటివ్ అని తేలినా సరే.. 14రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలి.