ప్లే బాయ్’పై కరోనా ఎఫెక్ట్

సినీ పరిశ్రమకు కరోనా కాటు తప్పలేదు. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్, సినీ ఫంక్షన్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. థియేటర్స్ మూతపడ్డాయి. గత కొద్ది రోజులుగా మేగజైన్ల అమ్మకాలు కూడా తీవ్ర స్థాయిలో పడిపోవటంతో.. పబ్లిషర్లు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభావం సెన్సేషనల్ మ్యాగజైన్‌ ప్లే బాయ్ పైన కూడా పడింది.

1960లో ప్రారంభమైన ఈ పత్రిక న్యూడ్ ఫోటో షూట్ లతో సంచలనం సృష్టించింది. పరిస్థితుల్లో ఈ పత్రిక ఈ వారం వెలువడనున్న ఎడిషన్‌ తమ చివరి ప్రింట్‌ ఎడిషన్‌గా ప్రకటించింది. భవిష్యత్తులో ఏవైన ప్రత్యేకమైన ఎడిషన్స్‌ను ప్రింట్ చేసే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌ ఎడిషన్‌ మాత్రం ఇక మీద ప్రింట్ చేయమని యాజమాన్యం వెల్లడించింది.ప్రస్తుతానికి ప్లేబాయ్‌ ప్రింటింగ్ నిలిపివేస్తున్నాం 2021లో ప్లే బాయ్ డిజిటల్‌ ఎడిషన్‌తో పాటు మరిన్ని కొత్త ప్రాడక్ట్స్‌ ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నామని ప్లే బాయ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ కాన్‌ తెలిపారు.