కరోనా బాధితులకి రానా గిఫ్ట్

కరోనా ఎఫెక్ట్ తో అందరు ఇంటికే పరితమితం కావాల్సిన పరిస్థితి. విద్యాసంస్థలు, థియేటర్స్, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ మూతపడుతున్నాయి. జనాలు బయటికొచ్చే పరిస్థితి లేదు. మరీ.. ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం ఎలా ? టీవీ చూడటం మాత్రమే. రొటీన్ సీరియల్స్, సినిమాలు చూసి బోర్ కొట్టేవారికి హీరో రానా దగ్గుపాటి ఓ చిన్ని గిఫ్ట్ అందించారు.

రానా ఇచ్చిన గిఫ్ట్ ప్రత్యేకంగా చిన్న పిల్లలకి. ‘టింకిల్’, ‘అమరచిత్రకథ’ యాప్ లను ఒక నెలపాటు ఉచితంగా అందిస్తున్నామనీ, ప్రజలు ముఖ్యంగా పిల్లలు బయట ఎక్కువగా తిరగకుండా ఇంటిపట్టున ఉండి ఈ అప్లికేషన్ ల ద్వారా వినోదం, విజ్ఞానం పొందండని రానా తెలిపారు. మరోవైపు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో టాలీవుడ్ స్టార్స్ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వీడియోలు, ట్విట్ల ద్వారా కరోనాపై జాగ్రత్తలు చెబుతున్నారు.