నిర్భయ లాయర్ ఫీజు ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే !
నిర్భయ కేసు 7యేళ్లుగా కొనసాగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు అయింది. నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్(32), పవన్ గుప్త(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను ఈ ఉదయం 5:30 గంటలకు తిహార్ జైలులో ఉరి తీశారు. జైలు నంబరు3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.
ఉరి అమలుపై నిర్భయ తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో నిర్భయ లాయర్ సీమా ఖుష్వాహ ప్రతిభని మెచ్చుకొని తీరాల్సిందే.న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటూ ఉరిశిక్షను వాయిదా వేసుకుంటూ వచ్చినా.. దోషులను ఉరికంబం ఎక్కించేవరకు వదిలిపెట్టలేదు సీమా ఖుష్వాహ.
ఉత్తరప్రదేశ్‌కు సీమా ఖుష్వాహా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యురాలుగా ఉన్నారు. ఇక ఈ కేసు వాదించినందుకు ఆమె ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని అనుకుంది. నిర్భయ దోషులకు ఉరి అమలు కావడంతో ఇప్పుడు సీమా ఖుష్వాహపై ప్రశంసలు కురుస్తున్నాయి. దానికి ఆమె అర్హురాలు కూడా.