నిర్భయ లాయర్‌ పై ప్రశంసలు

సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ తల్లికి న్యాయం జరిగిందని, ఎట్టకేలకు నిర్భయ ఆత్మ శాంతించింది. నిర్భయ దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను ఈ ఉదయం 5.30 గంటలకు తిహార్‌ జైలులో ఉరి తీశారు.  జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు.

ఉరి అమలుపై నిర్భయ తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేసింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. అలాగే ఆమె తరఫున వాదించిన న్యాయవాది సీమా కుష్‌వాహానీని ప్రశంసలతో ముంచుతున్నారు. నెటిజన్స్ కూడా మా కుష్‌వాహానీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, దోషులను కాపాడేందుకు చివరి నిమిషం వరకూ తీవ్రంగా ప్రయత్నించిన మరో న్యాయవాది ఏపీసింగ్‌పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.