‘జనతా కర్ఫ్యూ’కు టీమిండియా సపోర్ట్

కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడీ మహమ్మారి మనదేశంలోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ జాతీని ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే ఒకట్రెండు వారాల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనాకి మందు లేదు. ముందస్తు జాగ్రత్తలు మాత్రమే శరణ్యం. ప్రజలు ఇంటికే పరిమితం కావాలి. ఈ ఆదివారం జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకి సినీ, క్రీడాకారులు సపోర్ట్ తెలిపుతున్నారు. టీమిండియా జనతా కర్య్ఫూకి మద్దతు తెలిపింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సహా అనేక మంది క్రికెటర్లు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ట్విటర్‌లో కోరారు.

“కొవిడ్‌ 19 వల్ల కలిగే ముప్పును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మనమంతా బాధ్యతాయుతమైన పౌరులం. మన ఆరోగ్య భద్రత కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచనలను పాటిద్దాం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా బాధితులను కాపాడుతున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించి మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం” అంటూ విరాట్‌ కోహ్లీ ట్విట్ చేశారు.

“ప్రధాని నరేంద్రమోదీతో చేతులు కలిపి ఈ ఆదివారం జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఎంతో సంయమనం పాటించాలి” అని రవిశాస్త్రి రాసుకొచ్చారు. వీరితో పాటు శిఖర్ ధావవ్, కె ఎల్ రాహుల్, రిషభ్ పంత్, అశ్విన్, ఉమేష్ యాదవ్, రహానె, కులదీప్.. తదితరులు జనతా కర్ఫ్యూకి సపోర్ట్ తెలుపుతూ ట్విట్ చేశారు.